మరో వేర్పాటు ఉద్యమం 'మన్యసీమ రాష్ట్రం'

ఆధునిక సమాజానికి దూరంగా మారు మూల ప్రాంతాల్లో నివసిస్తూ విద్య, వైద్యానికి నోచుకోక గిరిజనులు ప్రాణాలను కోల్పోతున్నారంటూ ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికను సైతం సాధన సమితి ప్రతినిధులు శ్రీకృష్ణ కమిటీకి వివరించారు. ఇవే అంశాలను వారు ప్రధానంగా తెరపైకి తీసుకురానున్నారు. 1917లో బ్రిటీష్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన అటవీ హక్కుల అంశం, దీనిపై రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలను వారు సోనియా గాంధీ, ఇతర గిరిజన నేతలకు వివరించారు.
అపార వనరులు, ఖనిజ సంపద, జల వనరులు అందుబాటులో ఉన్నా వందల ఏళ్ల నుంచి దోపిడీకి గురవుతోన్న ఆదివాసీల దీన స్థితిని ప్రతినిధుల బృందం జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లనుంది. భౌగోళికంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏడు లోక్‌సభ, 48అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని, ఒక్కో నియోజకవర్గం పరిధిలో సుమారు 2నుంచి రెండున్నర లక్షల మంది గిరిజన జనాభా ఉందనే గణాంకాలను ఈ బృందం సోనియా ముందుంచింది.
స్టిస్ శ్రీకృష్ణ కమిటీకి లేఖ అందజేసిన వారిలో సింహాచలం, లక్ష్మణరావు, గోపీ (శ్రీకాకుళం), ఆర్‌కె సింహాచలం, జగన్నాథ రావు (విజయనగరం), ఆర్‌ఎస్. దొర, ఎస్. గంగాధర స్వామి (విశాఖపట్నం), మల్లేశ్వరరావు, వెంకన్నదొర (తూర్పు గోదావరి), కె సత్యనారాయణ, డి. సంక్రుడుదొర (పశ్చిమగోదావరి), పొడు గు శ్రీనాథ్, కణితి లక్ష్మణరావు, గుండం శరత్ (ఖమ్మం), గోపాల్ రావు, కొత్త వీరయ్య, వి.పెంటక్క (వరంగల్), కె. సమ్మయ్య దొర, ఆర్. సురేందర్ (కరీంనగర్), అర్జు సీడం, వీర్రాజు, నాగోరావు, శ్రీశైలం, వి నర్సింహ, దాసరి నాగయ్య (ఆదిలాబాద్) ఉన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications