శ్రీకాకుళం జిల్లాలో మావోయిస్టుల టెర్రర్

దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఒడిషా సరిహద్దు గ్రామాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రధానంగా సీతంపేట ఏజెన్సీలోని భామిని, కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, ఉద్దానంలోని సరి హద్దు మండలాల్లో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఒడిషా నుంచి వచ్చే వాహనాలను, జిల్లాలోని పట్టణాల్లో ఉన్న లాడ్జీ లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అన్ని పోలీసు స్టేషన్ల వద్ద భద్రతను పటిష్టపరిచారు. పోలీసు స్టేషన్లపై మావోయిస్టులు దాడులకు పాల్పడవచ్చన్న అనుమానంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మరోవంక, మావోయిస్టులపై పోరుకు అదనపు బలగాలను రప్పిస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రత్యేక బలగాలు ఏఓబీలోకి చొచ్చుకుపోతున్నాయి. జాతీయ రహదారితో పాటు ఒడిషాకు వెళ్లే మార్గాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. మావోయిస్టు సానుభూతిపరులు ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో తనిఖీలను ముమ్మరం చేశాయి.












Click it and Unblock the Notifications