మా మధ్య గొడవ జరగలేదు: గండ్ర

Gandra Venkataramana Reddy
హైదరాబాద్: తనకూ తమ సహచర శాసనసభ్యుడు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికీ మధ్య ఏ విధమైన గొడవ జరగలేదని కాంగ్రెసు శాసనసభ్యుడు గండ్ర వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు. తమ మధ్య గొడవ జరిగినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. సంతకాల సేకరణ వల్ల మంత్రి పదవులు రావని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. మీడియాలో వచ్చిన వార్తలపై తనను లక్ష్మారెడ్డి అడిగారని ఆయన చెప్పారు.

మంత్రి పదవుల కోసం సంతకాల సేకరణ అవసరం లేదని, సంతకాల సేకరణ వల్ల ప్రయోజనమేమీ ఉండదని తాను లక్ష్మారెడ్డితో చెప్పినట్లు ఆయన తెలిపారు. ముందు కాంగ్రెసు గురించి తెలుసుకోవాలని తాను సూచించానని ఆయన అన్నారు. గొడవేమీ జరగలేదని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కూడా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+