ముస్లిం కోటా మా ఘనతే: రోశయ్య

ముస్లిం రిజర్వేషన్లకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో శాసనసభలో దానిపై చర్చ జరిగింది. ముస్లిం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చిత్తుశుద్ధితో కృషి చేసినందుకు మజ్లీస్ శానససభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ కృతజ్ఢతలు తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లను పది శాతానికి పెంచాలని, చట్టసభల్లో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ముస్లిం రిజర్వేషన్లకు సభ మద్దతు తెలిపింది.












Click it and Unblock the Notifications