అనంతపురం: సిజేరియన్ ఆపరేషన్‌లో రాష్ట్ర వైద్యుడొకరు ఆదివారం గిన్నిస్ రికార్డు సృష్టించారు. 8 నిమిషాల 40 సెకండ్లలోనే సిజేరియన్ ఆపరేషన్ పూర్తిచేసి వైద్యుడు షానవాజ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్సులో చోటు సంపాదించారు. గత రికార్డు తొమ్మిది నిమిషాలను బద్దలు కొట్టి అంతకంటే 20 సెకండ్లు తక్కువ సమయంలో ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేసి షానవాజ్ గిన్నిస్ రికార్డ్స్‌లోకి ఎక్కారు.