గాంధీనగర్: గుజరాత్ అల్లర్లు, గుర్బార్గా హత్యాకాండ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రశ్నించడం కేసు విచారణ లో అతిపెద్ద ముందడుగని, ఇది కేసులోని చిక్కుముడులను విప్పడానికి దోహదపడుతుందని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక విచారణ బృందం(సిట్) ప్రధాన అధికారి ఆర్ రాఘవన్ తెలిపారు. ఈ కేసులో వచ్చే నెల ఆఖరులోగా సుప్రీంకోర్టుకు తమ నివేదికను అందిస్తామని వెల్లడించారు.
అయితే మోడీని అడిగిన ప్రశ్నలపై వివరాలు తెలిపేందుకు రాఘవన్ నిరాకరించారు. మోడీని విచారించిన మాజీ సీబీఐ డీఐజీ ఏకే మల్హోత్రా ప్రశాంతంగా కనిపించారని, ఆయన సామర్థ్యంపై తమకు నమ్మకముందని తెలిపారు.