బళ్లారిలో తపాలా గణేష్ పై దాడి

ఒఎంసి అవినీతిని ప్రశ్నిస్తున్నాననే కారణంతోనే తనను అడ్డు తొలగించుకోవడానికి ఆ సంస్థ యాజమాన్యమే తనపై దాడి చేయించిందని తపాలా గణేష్ ఆరోపించారు. అయితే తపాలా గణేష్ పై జరిగిన దాడితో తమకు ఏ విధమైన సంబంధం లేదని ఒఎంసి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. తపాలా గణేష్ పై దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మీడియా ప్రతినిధులు కూడా కొంత మంది గాయపడ్డారు. ఓబుళాపురం గనులకు సంబంధించి అధికారుల సర్వేపై విషయాలు తెలుసుకోవడానికి మీడియా ప్రతినిధులు తపాలా గణేష్ వద్దకు వెళ్లారు.












Click it and Unblock the Notifications