జాతీయ పార్టీగా టిడిపి: ఢిల్లీకి చంద్రబాబు?

రాష్ట్ర విభజన జరిగితే చంద్రబాబు సీమాంధ్ర రాష్ట్రానికో, తెలంగాణ ప్రాంతానికో పరిమితం కావాలని అనుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు సీమాంధ్ర రాష్ట్రానికో, తెలంగాణ రాష్ట్రానికో ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకోవడం లేదని అంటున్నారు. ఈ స్థితిలో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగా తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా మార్చేసి ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు నడపాలనేది ఆయన ఉద్దేశమని చెబుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోనూ సీమాంధ్రలోనూ పార్టీని బలోపేతం చేసే విధంగా వ్యవహరించాలని ఆయన అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా మార్చే విషయంపై పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి.












Click it and Unblock the Notifications