బిగ్ బ్యాంగ్ ప్రయోగం విజయవంతం

భూమి సహా గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి, భూమి గమనానికి కారణమైన సౌర మండలం ఎలా ఏర్పడింది వంటి ప్రశ్నలకు ఈ ప్రయోగం ద్వారా సమాధానాలు లభిస్తాయి. భారత శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. తొలిసారిగా ప్రోటాన్లు ఢీకొనగానే అణు పరిశోధన ఐరోపా సంస్థ (సిఇఆర్ఎన్) కంట్రోల్ రూంలోని శాస్త్రవేత్తలు ఆనంద సంద్రంలో మునిగిపోయారు. ఈ ప్రయోగాన్ని లార్జ్ హాడ్రాన్ కొల్లైడర్ (ఎల్ హెచి సి)గా పిలుస్తున్నారు.
ఈ ప్రయోగాన్ని తొలుత 2008 సెప్టెంబర్ 10వ తేదీన ప్రారంభించారు. 2008 సెప్టెంబర్ 19వ తేదీన హీలియం గ్యాస్ లీక్ కావడంతో పెద్దయెత్తున రోడ్ బ్లాక్ ఏర్పడింది. దాంతో మరమ్మతులు, ఇతర రక్షిత వ్యవస్థల కోసం మరో 24 మిలియన్ పౌండ్లు ఖర్చు చేశారు. యంత్రాన్ని రెండు 7 టిఇవి ప్రోటాన్లను ఢీకొనేలా రూపొందించారు.












Click it and Unblock the Notifications