హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి ఈ పరీక్షలు ఏప్రిల్ 7వ తేదీ నుంచి జరుగుతాయని ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒయు పరిధిలోని డిగ్రీ పరీక్షలు బుధవారం నుంచి జరగాల్సి ఉంది. హైదరాబాద్ పాతబస్తీలో అల్లర్లు చెలరేగి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలను వాయిదా వేసింది.
కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంగళవారం జరగాల్సిన ఎంబిఎ పరీక్ష కూడా వాయిదా పడింది. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించారు.