బిసి, ఎస్సీ ఘర్షణలు, ఎస్సై నిర్బంధం

Krishna Dist
గంపలగూడెం (కృష్ణాజిల్లా): బిసి, ఎస్ సి వర్గాల మధ్య జరుగుతున్న గొడవలు ఒక ఎస్సై నిర్బంధం వరకు వెళ్ళాయి. ఒక వ్యక్తిపై అకారణంగా చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ గంపలగూడెం ఎస్‌ ఐ నాగేంద్రకుమార్‌ ను బుధవారం అమ్మిరెడ్డి గూడెంలో ఒక వర్గానికి చెందిన వ్యక్తులు రోడ్డుపై నిర్బంధించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో కాపుసారా విక్రయాలు జరగనీయబోమంటూ 10 రోజులుగా ఎస్సీ కాలనీకి చెందిన యువకులు సాయంత్రం వేళల్లో హడావుడి చేస్తున్నారు. బీసీ కాలనీలోని కాపుసారా తయారీ, అమ్మకందారుల ఇళ్లలోకి వెళ్లి దాడులు చేస్తూ ఎస్సీ కాలనీలో యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నారు. దీంతో ఆగ్రహించిన కొందరు బీసీ కాలనీవాసులు ఆ యువకుల్ని నిలదీశారు. వేల్పుల చిన్నబ్బాయి, ఏలియా అనే వ్యక్తులను పోతురాజు కొండ అనే వ్యక్తి ప్రశ్నించడంతో వివాదం ముదిరింది.

గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు సమాచారం అందుకున్న ఎస్‌ ఐ నాగేంద్రకుమార్‌ సిబ్బందితో అమ్మిరెడ్డిగూడెం వెళ్లారు. ఎస్సీ కాలనీ యువకుల ఫిర్యాదు మేరకు పోతురాజు కొండ, చక్కా ముత్తయ్య, మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని జీపులోకి ఎక్కించారు. వివాదానికి కారకులైన ఎస్సీ కాలనీ యువకులను వదిలేసి తమను ఎందుకు అదుపులోకి తీసుకుంటారంటూ బీసీ కాలనీవాసులు పోలీసు జీపును అడ్డుకున్నారు. పోలీసులు, బీసీ కాలనీవాసులకు మధ్య వాదప్రతివాదనలు జరుగుతుండగా, ఎస్‌ఐ నాగేంద్రకుమార్‌ పోతురాజు కొండపై చేయి చేసుకున్నారు. దీంతో కొండ స్పృహ తప్పగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమకెలాంటి సంబంధం లేకున్నా ఎస్ ‌ఐ చేయి చేసుకున్నారని చెక్కా ముత్తయ్య ఆరోపించారు.

అసభ్యపదజాలంతో దూషిస్తూ, చేతికందిన వారిని కొట్టారని న్యాయం జరిగే వరకు పోలీసులను వదిలేదిలేదంటూ రాత్రి 9 గంటల వరకు ఎస్‌ఐని, సిబ్బందిని జీపుతో సహా గ్రామస్తులు నిర్బంధించారు. రోడ్డుకు అడ్డుగా బండరాళ్లు పెట్టారు. గ్రామంలో పూర్తిగా కాపుసారా నిషేధిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని వారంటున్నారు. ఎస్‌ఐ చేతిలో గాయపడిన పోతురాజు కొండను 108లో తిరువూరు కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కాగా రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తిరువూరు ఎస్‌ఐ గోపాలకృష్ణ, ఎక్సైజ్‌ సీఐ ప్రకాష్‌, కాంగ్రెస్‌ నేత మందపాటి చినగోపిరెడ్డి స్థానికులకు నచ్చజెప్పడంతో ఎస్‌ఐని విడిచిపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+