హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య ఆరోగ్యంగా ఉన్నారని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వైద్యులు చెప్పారు. ముఖ్యమంత్రికి నిమ్స్ వైద్యులు గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రి గురువారం ఉదయం నిమ్స్ లో చేరారు. మధ్యాహ్నం వరకు నిమ్స్ లోనే ఉన్నారు. అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు.
ముఖ్యమంత్రికి రక్త పరీక్షలు, హృదయ సంబంధమైన పరీక్షలు నిర్వహించామని నిమ్స్ వైద్యులు చెప్పారు. ముఖ్యమంత్రికి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేవని వారు చెప్పారు.