రేపు కర్ఫ్యూలో సడలింపు ఉండదు: ఖాన్

ప్రస్తుతం హైదరాబాదులోని 25 పోలీసు స్టేషన్లలో కర్ఫ్యూ కొనసాగుతోంది. పరిస్థితి ప్రశాంతంగా ఉంది. అల్లర్లకు కారణమైన వారిని గుర్తించామని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. పాతబస్తీలో చాలా మందిని అరెస్టు చేశామని, గతంలో అల్లర్లకు పాల్పడినవారిపై నిఘా పెట్టామని ఆయన చెప్పారు.
కాగా, రేపు ప్రార్థన సమయంలో అనుసరించాల్సిన విధానంపై పోలీసు అధికారులు సమీక్షిస్తారని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. హైదరాబాదులో పరిస్థితిని ఆమె గురువారం సమీక్షించారు. పాతబస్తీకి మరో పది కంపెనీల పోలీసు బలగాలను తరలిస్తున్నామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications