నిట్ లో వైవి రావు ప్రత్యక్షం, సంచలనం

YV Rao
కాజీపేట: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్‌ వై.వి.రావు నిట్‌లో మళ్లీ ప్రత్యక్షమయ్యారు. ప్రధాన కార్యాలయంలో ఆయన బుధవారం బిజీబిజీగా గడిపారు. పొద్దంతా ఫైళ్ల పరిశీలన, చెక్కులపై సంతకాలు చేస్తూ కన్పించారు. తన కోటరీ ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత తన నివాసానికి చేరుకున్నారు. సెలవుపై వెళ్లమని గవర్నెన్స్‌ బాడీ ఆదేశించినప్పటికీ వై.వి.రావు క్యాం పస్‌లో ప్రత్యక్షం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఆశ్చర్యపోయారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన విద్యార్థుల ప్రశ్నల పరంపరను తట్టుకోలేక రాజీనామా చేయడం, ఆ తర్వాత మాటమార్చడం, ఆయన్ను దీర్ఘకాలిక సెలవుపై వెళ్లమని గవర్నెన్స్‌బాడీ విస్తృత స్థాయి సమావేశంలో చైర్మన్‌ ఆదేశించడం విదితమే. గవర్నెన్స్‌ బాడీ సమావేశంలో ఉన్న ఎంహెచ్‌ఆర్‌డీ అధికారులు కూడా వై.వి.రావును సెలవుపై వెళ్లమని సూచించడంతో ఆయన అందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ తర్వాత వారంరోజులుగా ప్రధాన కార్యాలయానికి దూరంగా ఉన్న రావు ఢిల్లీ స్థాయిలో తన పలుకుబడిని ఉపయోగించి, మళ్లీ విధుల్లోకి చేరడానికి యత్నిస్తున్నారనే ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలో ఆయన నిట్‌లో అడుగుపెట్టడం చర్చనీయాంశమైంది.

వై.వి.రావును సెలవుపై వెళ్లమని మార్చి 26న గవర్నెన్స్‌ బాడీ ఆదేశించిన విషయం వాస్తవమని నిట్ చైర్మన్ దీక్షితులు అన్నారు. ఎంహెచ్‌ఆర్‌డీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వై.వి.రావుకు ఇంకా అంది ఉండకపోవచ్చని, మార్చి 31న బిల్లులకు నెలాఖరు కావడంతో విధులకు హాజరై ఉంటారని ఆయన సర్ది చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+