కాగ్ తప్పు పట్టలేదు, సూచనలిచ్చింది: పొన్నాల

Ponnala Laxmaiah
హైదరాబాద్: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపును తప్పు పట్టలేదని, సూచనలు మాత్రమే చేసిందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీలను కలిసిన ఆయన శుక్రవారం హైదరాబాద్ వచ్చారు. ప్రాణహిత - చేవెళ్ల, పోలవరం, దేవాదులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని ఆయన చెప్పారు. దేశంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులపై కన్నా రాష్ట్రంలో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులకే కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందని ఆయన అన్నారు.

జలయజ్ఞం కింది ప్రాజెక్టులకు నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని, కేంద్రం అందుకు సుముఖంగా ఉందని, 13 వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించిందని ఆయన చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగడం లేదని ఆయన అన్నారు. ఈ ఏడాది 39 ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటికి 7 వేల కోట్ల రూపాయలు కేటాయించామని ఆయన చెప్పారు. జలయజ్ఝం కింది ప్రాజెక్టులకు ఇప్పటి వరకు 51 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+