రేపు కర్ఫ్యూలో సడలింపు: ఎకె ఖాన్

AK Khan
హైదరాబాద్: హైదరాబాద్ లో అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో రేపు శనివారం కర్ఫ్యూలో సడలింపు ఉంటుందని నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. నిన్నటి కన్నా రేపు ఎక్కువ సేపు సడలింపు ఉంటుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆయన శుక్రవారం అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి శాంతి సామరస్యాలకు సహకరించాలని కోరారు. దక్షిణ, పశ్చిమ మండలాల్లో వేర్వేరు సమయాల్లో కర్ఫ్యూ సడలింపు ఉంటుందని ఆయన చెప్పారు. ప్రశాంత వాతావరణ కల్పనకు ప్రజలు బాగా సహకరించారని ఆయన కొనియాడారు.

వీడియో క్లిప్పింగుల ఆధారంగా అల్లర్లకు పాల్పడినవారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని, త్వరలోనే వారిని గుర్తిస్తామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 130 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అల్లర్లకు సంబంధించి కీలక సమాచారం సేకరించామని ఆయన అన్నారు. విచారణ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. నగరంలోని 25 పోలీసు స్టేషన్ల పరిధిలో దశలవారీగా కర్ఫ్యూ సడలిస్తామని ఆయన చెప్పారు. శుక్రవారం ముస్లిం సోదరుల ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ పాసులున్నవారు కొంత మంది పాతబస్తీలోని మక్కా మసీదులో ప్రార్థనలు చేశారు. హైదరాబాదులో ప్రశాంత వాతావరణం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+