శ్రీకృష్ణ కమిటీకి పెద్దగా పని లేదు: కెకె

Keshav Rao
న్యూఢిల్లీ: రాష్ట్ర పరిస్థితిపై వేసిన శ్రీకృష్ణ కమిటీకి పెద్దగా పనేం లేదని, ఫజల్ అలీ కమిషన్ నివేదికను క్షుణ్నంగా అధ్యయనం చేసి దాన్ని అనుసరిస్తే చాలునని కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత కె. కేశవ రావు అన్నారు. తాము స్వయం పాలన, ఆత్మగౌరవం కోసం తెలంగాణను కోరుకుంటున్నామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మజ్లీస్ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుడు మినహా మిగతా పార్టీల నేతలందరూ తెలంగాణను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

విడిపోతామని తెలంగాణ ప్రజలు అంటుంటే, కలిసుందామని సీమాంధ్ర నేతలు అనడంలో అర్థం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో శాసనసభ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై పార్టీ అధిష్టానానికి తన అభిప్రాయాన్ని చెబుతానని ఆయన అన్నారు. పాతబస్తీ అల్లర్లపై విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ అల్లర్ల వెనక కుట్ర ఉందని అనుకోవడం లేదని ఆయన అన్నారు. అయితే కుట్ర దాగి ఉందనే అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారని, అందువల్ల విచారణ జరిపించడం మంచిదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+