కర్నూలు జిల్లాలో వెయ్యి గ్రామాలకు మినరల్ వాటర్

Kurnool
కోవెలకుంట్ల: రానున్న ఐదు సంవత్సరాల్లో నంద్యాల లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని వేయి గ్రామాల్లో మినరల్‌వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నంద్యాల ఎంపీ ఎస్పీవైరెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం పేరా ఫంక్షన్‌హాల్‌ సమీపంలో రూ.1.10 లక్షలతో ఏర్పాటు చేసిన మినరల్‌వాటర్‌ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ఈ ప్లాంట్‌లో గంటకు వేయి లీటర్ల చొప్పున ఫిల్టర్‌ అవుతుందన్నారు. గ్రామాల్లో మినరల్‌వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆరు నెలల క్రితమే ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పటికీ వరద ల కారణంగా వీటి ఏర్పాటులో జాప్యమైందన్నారు. ముందుగా ఫ్లోరైడ్‌ శాతం అధికంగా ఉన్న గ్రామాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ గ్రామాల్లో సురక్షిత నీటి సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు.

నాలుగు రోజుల్లో కోవెలకుంట్ల మండలంలోని రేవనూరు గ్రామంలో రెండు, నెల రోజుల్లో భీమునిపాడు గ్రామంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే కోవెలకుంట్ల పట్టణంలో మూడు చోట్ల ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కోకుటుంబానికి రోజుకు 20 లీటర్ల చొప్పున మినరల్‌వాటర్‌ను అందజేస్తామన్నారు. అయితే సభ్యత్వం కింద నెలకు ఒక్కోకుటుంబం రూ.10 చెల్లించాలన్నారు. కంపమల్ల గ్రామంలో బురదనీరు తాగాల్సి వస్తోందని గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకురాగా వీలైనంత త్వరలో గ్రామంలో మినరల్‌వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. కేసీ కెనాల్‌కు నీటి విడుదల చేశారని, మరో 15రోజులపాటు కేసీలో నీరు ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోవెలకుంట్ల, భీమునిపాడు కాంగ్రెస్‌ నాయకులు పేరా రామసుబ్బారెడ్డి, ఆరికట్ల సుంకిరెడ్డి, అల్లూరు బాలిరెడ్డి, కోవెలకుంట్ల సీఐ మురళీనాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+