అల్లర్లకు కర్నాటక నిధులు ఉత్తదే: సబిత

Sabitha Indra Reddy
హైదరాబాద్: హైదరాబాద్ అల్లర్లకు కర్నాటక నిధులు అందాయని, అల్లర్లలో ఐఎస్ ఐ హస్తం ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. పాతబస్తీలో కర్ఫ్యూ, తదితర పరిస్థితులపై ముఖ్యమంత్రి రోశయ్య గురువారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. గురువారం కర్ఫ్యూ సడలించిన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. శుక్రవారం ప్రార్థనల నేప«థ్యంలో సడలింపు విషయంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని స్థానిక పోలీసు అధికారులకు అప్పగించాలని సీఎం ఆదేశించారు. మతపెద్దలతో మాట్లాడి వారి సహకారం తీసుకోవాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు సూచించారు.

హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలతో పాటు, సమస్యాత్మకంగా భావించే జిల్లాల్లో సైతం అదనపు బలగాలను మోహరించాలని డీజీపీని ఆదేశించారు. కర్ఫ్యూ సడలించిన సమయంలో ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి 206 రేషన్‌షాపులు తెరిచి ఉంచామని, ముప్ఫైకి పైగా సంచార కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేశామని, పాలు పుష్కలంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నామని అనంతరం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి విలేఖరులకు తెలిపారు. సడలింపు సమయంలో అధిక ధరలకు నిత్యావసర వస్తువులు అమ్మినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇకపై అలాంటి వారిపై చర్య తీసుకుంటామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+