శ్రీనగర్: కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు రైల్వే ట్రాక్ ను పేల్చేశారు. అవంతిపొరా, కాక్పోరాల మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది. గెరిల్లాలు గురువారం రాత్రి పుల్వామాలోని రత్నిపొరా వద్ద ఐఇడితో రెండు, మూడు మీటర్ల రైల్వే ట్రాక్ ను పేల్చేసినట్లు, ట్రాక్ ను పునరుద్ధరించినట్లు, రైళ్ల రాకపోకలు యధావిధిగా సాగుతున్నట్లు పుల్వామా ఎస్ఎస్పీ ఖైఫయత్ హైదర్ చెప్పారు.
తమ ఉనికిని చాటుకోవడానికే ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడ్డారని హైదర్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్ లోయలో రైలు ట్రాఫిక్ ను ధ్వంసం చేయడం ఇదే తొలిసారి. ఈ ట్రాక్ ఉత్తర కాశ్మీర్ ను దక్షిణ కాశ్మీర్ తో కలుపుతుంది.