రాజకీయాలకు జయసుధ గుడ్ బై?

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో అనూహ్యంగా ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. సికింద్రాబాద్ శాసనసభా నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ ను అనూహ్యంగా ఓడించి శాసనసభలో అడుగు పెట్టారు. అయితే ఆమె రాజకీయాల్లో ఇమడలేకపోతున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి తప్పుకుని ఆమె తిరిగి టాలీవుడ్ లో ప్రవేశిస్తారని చెబుతున్నారు. హీరోయిన్ గా కాలం చెల్లినా ఆమె విభిన్నమైన పాత్రలు పోషిస్తూ వచ్చారు. తిరిగి తన మాతృ రంగం మీద ఆమె దృష్టి పెడతారని అంటున్నారు.












Click it and Unblock the Notifications