పాతబస్తీలో అసదుద్దీన్ ధర్నా: ఉద్రిక్తత

Charminar
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో సాధారణ పరిస్థితి నెలకొంటుందని భావిస్తున్న తరుణంలో శుక్రవారం అర్థరాత్రి ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. యువకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ, పోలీసులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని వందలాది మంది కార్యకర్తలతో కలిసి వచ్చి చార్మినార్ పోలీసు స్టేషన్ వద్ద దర్నాకు దిగారు. దాంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

అక్రమంగా అరెస్టు చేసిన తమ కార్యకర్తలను విడుదల చేయాలని అసదుద్దీన్ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శుక్రవారం రాత్రి పోలీసులు 25 మంది యువకులను అల్లర్లకు సంబంధించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో అసదుద్దీన్ ఆగ్రహంతో పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి ధర్నాకు దిగినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+