హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లోని సానియా ఇంటికి షోయబ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Shoaib Malik
హైదరాబాద్: హైదరాబాదుకు చెందిన అయేషా సిద్దిఖి ఆరోపణలో నేపథ్యంలో టెన్నిస్ క్రీడాకారిణి సానియాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ హైదరాబాద్ వచ్చాడు. అతను శుక్రవారంనాడే హైదరాబాద్ వచ్చినట్లు టీవీ చానెళ్లు వార్తా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. సానియా నివాసంలో షోయబ్ మాలిక్ ఫోన్ లో బాల్కనీలో మాట్లాడుతూ నిలుచున్న దృశ్యాలను తెలుగు టీవీ చానెళ్లు కొన్ని ప్రసారం చేస్తున్నాయి. ఈ దృశ్యాలను స్టార్ న్యూస్ ప్రత్యేకంగా తీసినట్లు కూడా ఆ చానెళ్లు పేర్కొంటున్నాయి.

అయేషా సిద్దిఖితో పెళ్లి విషయంలో ఆమె తల్లిదండ్రులు ఆధారాలను బయట పెట్టిన నేపథ్యంలో సానియా కుటుంబ సభ్యులకు మరింత వివరణ ఇవ్వడానికి మాలిక్ హైదరాబాద్ వచ్చినట్లు చెబుతున్నారు. సానియా కుటుంబ సభ్యులు ఇంట్లో మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో సానియా, షోయబ్ మాలిక్ పెళ్లి వేదిక దుబాయ్ మారినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పెళ్లికి ఆటంకాలు ఉండవచ్చుననే ఉద్దేశంతో వివాహ వేదికను దుబాయ్ కి మార్చుకున్నట్లు తెలుస్తోంది. షోయబ్ మాలిక్ శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడే అవకాశాలున్నట్లు కూడా వార్తాకథనాలు తెలియజేస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X