అయేషాతో రాజీకి షోయబ్ యత్నాలు?

Shoaib Malik
హైదరాబాద్: తన మొదటి భార్య అయేషా సిద్ధిఖితో రాజీకి పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ మధ్యవర్తి ద్వారా ఆయన ఈ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మాలిక్ అయేషా ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా చెబుతున్నారు. అయితే ఇరు కుటుంబాల సభ్యులు వేరే చోట కూర్చుని రాజీ ఫార్ములాను రూపొందించుకునే అవకాశాలున్నాయి. షోయబ్ మాలిక్ శుక్రవారం రాత్రి రహస్యంగా దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. సానియా ఇంట్లోని బాల్కనీలో ఫోన్ లో మాట్లాడుతూ ఓ టీవీ చానెల్ వీడియోకు చిక్కారు. ఆయన పక్కన సానియా కూడా ఉంది. సానియాను ఆమె తల్లి ఏదో బుజ్జగిస్తున్నట్లు కూడా టీవీ చానెల్ దృశ్యాల్లో కనిపించింది.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తో గతంలో పదవులు నిర్వహించిన చాముండేశ్వరీ నాథ్ సానియా ఇంటికి చేరుకున్నారు. అయేషాతో రాజీకి చాముండి మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశాలున్నాయి. అయేషాతో రాజీకి పెద్దగా ఆటంకాలు ఉండకపోవచ్చునని అంటున్నారు. సానియా వివాహానికి తాను వ్యతిరేకం కాదని, అయితే షోయబ్ మాలిక్ బహిరంగంగా తనకు విడాకులివ్వాలని అయేషా సిద్ధిఖి అంటోంది. సానియా, షోయబ్ ల వివాహాన్ని అడ్డుకోనని కూడా ఆమె అంటోంది. అందువల్ల అయేషాతో షోయబ్ రాజీకి పెద్దగా సమస్యలు ఉండే అవకాశాలు లేవని అంటున్నారు.

కాగా, ఇస్లాంలో పురుషులు రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అయితే రెండో పెళ్లికి మొదటి భార్య అనుమతి తప్పనిసరి అని కొందరు అంటుండగా ఆ అవసరం ఏమీ లేదని మరి కొందరు అంటున్నారు. అందువల్ల షోయబ్ తో సానియా పెళ్లికి పెద్దగా ఆటంకాలు ఉండకపోవచ్చునని తెలుస్తోంది. అయితే, అయేషా వివాదంతో సానియా తీవ్రంగా కలత చెందినట్లు సమాచారం. రాత్రంతా తాను నిద్రపోలేదని ఆమె ట్విట్టర్ లో రాసుకున్నారు. షోయబ్, అయేషాల వివాదం నేపథ్యంలో సానియా ఇంటికి ఆమె అభిమానులు చేరుకుంటున్నారు. ఈ స్థితిలో ఆమె ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+