హైదరాబాద్: ఈ నెల 15న హైదరాబాద్‌లో తాను సానియా మిర్జాని పెళ్లి చేసుకుంటున్నట్లు పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చెప్పారు. సానియా నివాసం వద్ద మాలిక్ ఈరోజు విలేకరులతో మాట్లాడారు. ఇంతకు ముందు తనని మాలిక్ పెళ్లి చేసుకున్నాడన్న ఆయేషా విషయంలో ఏమీ మాట్లాడలేనన్నారు. ఈ విషయం చట్టపరిధిలో ఉన్నందున ఏమీ మాట్లాడనని చెప్పారు. మీ సందేహాలకు తమ లాయర్ సమాధానాలు ఇస్తారని చెప్పారు.
తాను ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. పెళ్లి కోసమే ఇక్కడికి వచ్చానని చెప్పారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. పెళ్లి తరువాత కూడా సానియా ఇండియా తరపునే టెన్నిస్ ఆడుతుందని మాలిక్ చెప్పారు