• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

షోయబ్ పై కేసు: అరెస్టు అవకాశాలు

By Pratap
|

Shoaib Malik
హైదరాబాద్: అయేషా సిద్దిఖితో పెళ్లి వివాదంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పై హైదరాబాదులోని బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. మాలిక్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. దీంతో మాలిక్ కు ముందస్తు బెయిల్ కోసం సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ప్రయత్నాలు మొదలు పెట్టారు. సిద్దిఖి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మాలిక్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. షోయబ్ పై భారత శిక్షాస్మృతి చట్టం 498ఎ, 506, 420 కింద కేసులు నమోదయ్యాయి.

కాగా, అయేషా సిద్దిఖి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేయడానికి సిద్ధమవుతున్నారు. అయేషా ఇంటికి వెళ్లి పోలీసులు ఆ పని చేయనున్నట్లు సమాచారం. తాను షోయబ్ ద్వారా గర్భవతిని అయ్యానని అయేషా సిద్దిఖి ఆదివారం ఆరోపించారు. అమె ఎప్పుడు గర్భవతి అయింది, గర్భవిచ్ఛిత్తి ఎప్పుడు జరిగిందనే విషయాలను వెల్లడించడానికి అయేషా సిద్దిఖి నికారించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X