తెరాసది దివాళాకోరుతనం: చంద్రబాబు

సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో గ్రూపు తగాదాలకు పాల్పడవద్దని, అటువంటి తగాదాలకు దిగితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన పార్టీ నాయకులను హెచ్చరించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయ్యే వరకు నిర్విరామంగా కృషి చేయాలని ఆయన నాయకులకు సూచించారు. తమ పార్టీ 29 ఏళ్ల నవ యవ్వనంలో ఉందని, కాంగ్రెసు పార్టీ ముసలితనంతో బాధపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అల్లర్లకు ప్రభుత్వం చేతగానితనమే కారణమని ఆయన విమర్శించారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు స్పూర్తిదాయకమని, నిర్ణయించిన లక్ష్యాల సాధనకు సరైన వ్యక్తులకు సభ్యత్వం కల్పించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications