సంగారెడ్డిలో మినీ శిల్పారాం: గీతారెడ్డి

వాటిలో మినీ శిల్పారామం ఒకటి కాగా, మెదక్ చర్చి అభివృద్ధికి రూ. 3.50 కోట్లు, రూ. 4 కోట్లతో సింగూరు వద్ద పర్యాటక అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. గజ్వేల్ ను కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయతలపెట్టిన మినీ శిల్పారామానికి స్థల సేకరణ చేస్తున్నామన్నారు.
కళాకారులు, చేతివృత్తుల వారికి ఎంతో దోహదపడుతుందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం హైదారాబాద్ లోని శిల్పారామంలో రూ. 2.60 కోట్లతో నైట్ బజార్ కొనసాగిస్తున్నామన్నారు. 12 కోట్ల రూపాయలతో కొండాపూర్‌లోని మ్యూజియం నుంచి నందికంది, ఝరాసంగం, ఏడుపాయల, మెదక్ చర్చి నుంచి సిద్దిపేటలోని కోమటిచెరువు వరకు మెదక్ సర్కిట్‌గా ఓ ప్రతిపాదన తయారు చేశామన్నారు.












Click it and Unblock the Notifications