అందాల విశాఖకు రోశయ్య అభయం

Rosaiah
విశాఖపట్నం: ప్రపంచంలోని అత్యంత అందమైన అయిదు నగరాల్లో విశాఖ ఒకటి కావాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య ఆకాంక్షించారు. పాత జైలు స్థలంలో ఆదివారం ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ఆయన నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందన్నారు. నగరంలో కాలుష్య నియంత్రణపై సంబంధిత అధికారులతో చర్చించనున్నట్టు హామీ ఇచ్చారు.

సింహాచలం దేవస్థాన భూ సమస్యపై దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి అధ్యయనం చేస్తున్నట్టు వెల్లడించారు. విశాఖ సరస్వతీ నిలయమని ప్రశంసించారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును రూ.6000 కోట్లతో విస్తరిస్తుండటం ఆనందంగా ఉందన్నారు. నగర ప్రజల ఆరోగ్యానికి ఇప్పటికే కేజీహెచ్‌ ఉందని, దీనికి తోడు విమ్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు.

కేంద్ర మంత్రి డి.పురందేశ్వరి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపుపై ప్రజల్లోని ఆందోళనను తొలగించేలా రోశయ్య కృషి చేస్తున్నారన్నారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని ముఖ్యమంత్రిని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+