రేపు హైదరాబాద్ నుంచి సమైక్యాంధ్ర 'మేలుకొలుపు' యాత్ర

United Andhra
గుంటూరు: తెలంగాణ దొరల కుట్రలకు బలవుతు న్న బలహీన వర్గాలకు కాపాడేందుకు, చైతన్యం చేసేందుకు ఈనెల 6 నుంచి నిర్వహించనున్న 'మేలుకొలుపు' యాత్రకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బడుగు బలహీన వర్గాలు తరలి రావాలని సమైక్యాంధ్ర జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ నుంచి ప్రారంభించనున్న యాత్ర విజయవంతంపై చర్చించేందుకు ఆదివా రం గుంటూరులో బలహీన వర్గాల జేఏసీ ఏర్పాటుచేసిన సమావేశానికి సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ శామ్యూల్, పలు పార్టీల, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా యాత్ర కరపత్రాన్ని విడుదల చేశారు. జనాభాలో 80శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాల తరపున జేఏసీ ఏ ర్పాటుచేయటం హర్షనీయం అన్నారు. బలహీన వర్గాల జేఏసీకే అధిక ప్రాముఖ్యత ఉంటుందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఇది పెట్టుబడిదారుల ఉద్యమం అనటం తప్పన్నారు. కొద్ది మంది హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు ప్రారంభించినప్పటికీ అక్కడ 30 లక్షల మందికిపైగా బడుగు, బలహీన వర్గాలు వివిధ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారన్నారు. రాష్ట్ర విడిపోతే ప్రధానంగా నష్టపోయేది బలహీన వర్గాలేనన్నారు.

బలహీన వర్గాల జే ఏసీ కన్వీనర్ వైవి సురేష్ మాట్లాడుతూ కొందరు రాజకీయ నిరుద్యోగులు, పెత్తందారులు ఉద్యమం పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేయటం ద్వారా తమ అధిపత్యాన్ని, నాయకత్వాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. టీడీపీ జేఏసీ సభ్యులు మానుకొం డ శివప్రసాద్, నిమ్మకాయల రాజనారాయణ, జెట్టి మోహన్‌రావు, కంకణంపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ పెత్తందారుల ఉద్యమంలో 4,326మంది మృతిచెందగా, ఇందులో 4వేల మందికిపైగా బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారన్నారు. తెలంగాణలో 42కుపైగా జేఏసీలు ఉన్నప్పటికీ ఒక్కదానిలోనూ బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం లేదన్నారు.

బలహీన వర్గాలకు చెందిన కృష్ణ మాదిగ, చం దోలు శోభారాణి తదితరులను తెలంగాణ దొరలు దారుణంగా అవమానించారన్నారు. కాంగ్రెస్ నేతలు హిదాయత్, జల్ది రాజమోహన్, సరోజసుధ మాట్లాడుతూ చిన్న ర్రాష్టాలుగా ఏర్పడటం ద్వారా అసాంఘిక శక్తులు రాజ్యమేలుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. పీఆర్పీ నాయకులు క్రోసూరు వెంకట్, గిడుతూరి సత్యం, అత్తోట జోసఫ్ కుమార్‌లు మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ కుటిల రాజకీయాలను మేలుకొలుపుయాత్రతో బట్టబయలు చేస్తామన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చందోలు శశికుమార్, సమాజ్‌వాది పార్టీ నాయకులు పిల్లి బాబూరావు, మైనార్టీ నాయకులు అబ్దుల్ రజాక్, షేక్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+