రోశయ్యతో సయోధ్యకు జగన్ ప్రయత్నాలు

YS Jagan
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె రోశయ్యతో సయోధ్యకు కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో తన వర్గం ప్రయోజనాల దృష్ట్యా జగన్ సయోధ్యకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. కొంత మంది రాష్ట్ర మంత్రుల నుంచి వైయస్ జగన్ పై ఒత్తిడి వచ్చిందని, దీంతో ఆయన రోశయ్యతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇందుకు గాను జగన్ రేపు మంగళవారం రోశయ్యతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఈ సమావేశంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సన్నిహిత మిత్రుడు కెవిపి రామచంద్రరావు కూడా పాల్గొంటారు.

ఈ నెల 7వ తేదీన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగే లోపల రోశయ్యతో సంధికి రావాలని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ కమిటీలో జగన్, రోశయ్య ఇద్దరూ సభ్యులే. అదే రోజు ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడానికి ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జగన్ వర్గానికి చెందిన మంత్రులకు రోశయ్య ఉద్వాసన పలుకవచ్చుననే ఆందోళనలో ఉన్న మంత్రులు రోశయ్యతో సయోధ్య ప్రతిపాదన చేసినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+