ఘనంగా సబితా ఇంద్రారెడ్డి కుమారుడి పెళ్లి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, బిజెపి నాయకుడు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ హాజరయ్యారు. ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీరావు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు.
అయితే ఈ పెళ్లి వేడుకలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. వివాహ వేదిక మీదికి ఎక్కువ మంది ఒకేసారి రావడంతో వేదిక ముందు భాగం ఒరిగింది. దీంతో కొంత మంది కింద పడ్డారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చినప్పుడే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో భద్రతా సిబ్బంది ఆందోళన చెందారు.












Click it and Unblock the Notifications
