అమెరికాలో శ్రీవారి కల్యాణాలకు ఒబామా

2008-09 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకుంటున్న పరిస్థితుల్లో లోకకల్యాణార్థం శ్రీనివాస కల్యాణాలు నిర్వహించాలని ప్రవాస భారతీయలు కోరారన్నారు. వారి కోరిక మేరకు మే 1న న్యూజెర్సీలోని గురువాయురప్పన్ ఆలయంలో, 9న కాలిఫోర్నియాలోని సన్నివేల్ ఆలయంలో కల్యాణోత్సవాలను నిర్వహిస్తామన్నారు.
ఈ ఆలయాల ట్రస్టుబోర్డులు, తెలుగుటైమ్స్ సంస్థ సంయుక్త నిర్వహణలో 40 మందితో కూడిన కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే ఆయా ఆలయాలకు చేరుకున్న ఉత్సవమూర్తులకు నిత్యపూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారన్నారు. అన్నమయ్య సంకీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఎస్వీ భక్తి చానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications