సోనియా గాంధీతో డిఎస్ భేటీ

సోనియా గాంధీతో ఆయన రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై, మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలపై ఆయన మాట్లాడినట్లు సమాచారం. తెలంగాణలో 12 శాసనసభా నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికలపై కూడా ఆయన తన అభిప్రాయాన్ని వినిపించినట్లు తెలుస్తోంది. కాగా, డి. శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైనా, శాసనసభ ఉప ఎన్నికల్లోనైనా పోటీ చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆయన సోనియాతో మాట్లాడి ఉండవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications