మరో రెండేళ్లలో పెళ్లి: కత్రినా కైఫ్

తన గ్లామర్ ఇమేజ్ ను పక్కన పెట్టి కత్రినా రాజనీతిలో రాజకీయ నాయకురాలి పాత్ర పోషించింది. తన కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకమైందని ఆమె అంటోంది. ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటున్నానని, తన కెరీర్ లో ఈ పాత్ర కొత్త అడుగు అని ఆమె అన్నది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఆధారపడి తీసిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని కత్రినా అంటోంది. భారతదేశంలో సోనియా గాంధీ అత్యంత స్ఫూర్తిదాయకమైన నాయకురాలని, వ్యక్తిగతంగా కూడా సోనియా తనకు స్ఫూర్తి అని, సినిమా కథ గానీ తన పాత్ర గానీ సోనియా గాంధీని దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దుకోలేదని ఆమె వివరించింది.












Click it and Unblock the Notifications