కెసిఆర్ ద్రోహం చేశారు: కాకా

Venkataswamy
హైదరాబాద్: కేంద్రంలో మంత్రి పదవులు తీసుకొని తెలంగాణ తల్లి కడుపులో పొడిచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ద్రోహం చేశారని సీడబ్ల్యుసీ సభ్యుడు జి.వెంకటస్వామి (కాకా) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు అడ్డుపడిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మొదటి ద్రోహం చేస్తే, కేంద్రంలో మంత్రి పదవులు తీసుకొని కేసీఆర్ రెండో ద్రోహం చేశారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను అడ్డం పెట్టుకుని వైయస్ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఎన్నికలు మీరే జరుపుకోండంటూ కాంగ్రెసు అధిష్టానాన్ని హెచ్చరిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుకున్నారని అన్నారు.

తెలంగాణ ప్రాంతంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే - ఒక్కసారిగా సీమాంధ్ర నేతలను ఉద్దేశించి, తెలంగాణకు వెళ్లాలంటే పాసుపోర్టు తీసుకోవాల్సిందేనని వైయస్ వ్యాఖ్యానించడం ద్వారా ఆ ప్రాంతంలో హీరో అయ్యారని అన్నారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేయకుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేది కాదని చెప్పారు. ఉప ఎన్నికల్లో తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేసిన టీఆర్ఎస్‌తో సహా ఎవరూ పోటీ చేయకూడదన్న అభిప్రాయాన్ని కాకా వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చేంత వరకూ ఎన్నికల్లో పాల్గొనకుంటేనే నిరసన ఏమిటో తెలుస్తుందని, తెలంగాణ వస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వ్యయం 20 వేల కోట్ల నుంచి 39 వేల కోట్లకు పెంచేసి టెండర్లను పిలిచి కమీషన్లు కొట్టేశారని ఆరోపించారు. ఇప్పటి వరకూ తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆయన అన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఏం చేస్తున్నారో తెలియదని, గతంలో ఆయన దివంగత ముఖ్యమంత్రి వైయస్‌కు డోలు వాయిస్తూ వచ్చారని ఆరోపించారు. బంజారాహిల్స్ భూమి 40 ఏళ్ల కిందటే పట్టా ఉందని, దీనిపై అప్పట్లో ఎన్టీరామారావు అధికారంలోకి వచ్చిననాటి నుంచి నేటి వరకూ వివాదాలు కొనసాగాయని అన్నారు. ఈ భూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో నెగ్గామని అన్నారు. సుప్రీం కోర్టులో నెగ్గాక కూడా 40 లేదా 50 శాతం వదులు కోవాలని ముఖ్యమంత్రి కోరారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అంటే రోశయ్య అని సందేహాన్ని వ్యక్తం చేసినప్పుడు ..' తప్పు..తప్పు...రోశయ్యను అనలేను. వైయస్ రాజశేఖర రెడ్డి' అని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+