తెనాలి: తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ప్రముఖ సినీ నటుడు కృష్ణ స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలి మండలంలో గల తన స్వగ్రామం బుర్రిపాలెం వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెనాలి నుంచి పోటీ చేసే ఆలోచన తనకు లేదని, రాజీవ్ గాంధీ మరణం తర్వాత రాజకీయాలపై ఆసక్తి లేకుండా పోయిందని ఆయన అన్నారు.
తెనాలి నుంచే కాదు, రాష్ట్రంలోని ఎక్కడి నుంచి కూడా తాను పోటీ చేసే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. భవిష్యత్తులో సినిమాలపైనే దృష్టి పెడతానని, రాజకీయాల జోలికి వెళ్లనని ఆయన అన్నారు.