కాకినాడ: ముఖ్యమంత్రి రోశయ్య రెండు రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం రాజమండ్రి, కోనసీమలో జరిగే పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాత్రికి రాజమండ్రిలో బస చేస్తారు. సోమవారం మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాక ముఖ్యమంత్రి సామర్లకోట చేరుకుంటారు. అక్కడి నుంచి కాకినాడ వచ్చి స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక రోశయ్య జిల్లాకు రావడం ఇది రెండోసారి.
ఇలా ఉండగా నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర మోడో రోజుకు చేరుకుంది. ముఖ్యమంత్రి తూగో జిల్లాలో, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న జగన్ పక్కనే ఉన్న పగో జిల్లాలో ఇంత ఎండల్లో పర్యటించడం చెప్పుకోదగిన విశేషం.