కంచీపురం: ప్రసిద్ధ కంచి కామాక్షి అమ్మాన్ దేవస్థానానికి అపోలో ఆసుపత్రుల ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కుమార్తె ప్రీతీరెడ్డి, ఆమె భర్త విజయ్‌రెడ్డి భూరి విరాళాన్ని అందజేశారు. అమ్మవారికి 2 కిలోల బంగారు కిరీటాన్ని వారుబహుకరించారు.
ఈ కిరీటం విలువ రూ.40 లక్షలుంటుందని ఆలయ వర్గాలు తెలిపాయి. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కంచి ఆచార్య జయేంద్ర సరస్వతి ఈ కిరీటంతో అమ్మవారిని అలంకరించారు.