దురుద్దేశంతోనే నాపై ఆరోపణలు: థరూర్

Shashi Tharoor
న్యూఢిల్లీ: రాజీనామా చేయాలనే ప్రతిపక్షాల డిమాండ్ ను విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి శశిథరూర్ తిరస్కరించారు. ఐపియల్ వివాదం నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలపై శుక్రవారం ప్రకటన చేయడానికి ఆయన ప్రయత్నించారు. అయితే ఆయనను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో ఆయన ప్రకటనను సభ ముందుంచారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, దురుద్దేశంతో కూడుకున్నవని ఆయన తన ప్రకటనలో అన్నారు. కొచ్చి జట్టు లాభసాటిగా నడవకూడదనే ఉద్దేశంతో, ఐపియల్ ఫ్రాంచైజీని మరో చోటికి తరలించే లక్ష్యంతో వివాదం సృష్టించారని ఆయన అన్నారు.

ఐపియల్ కొచ్చి జట్టు వివాదంలో తన ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. కొచ్చి జట్టు ప్రమోషన్ కోసం తాను ప్రయత్నించానని ఆయన చెప్పారు. కొచ్చి ఫ్రాంచైజీలో తాను డబ్బులు పెట్టలేదని ఆయన అన్నారు. ఫ్రాంచైజీ విషయంలో డబ్బులు చేతులు మారలేదని కూడా ఆయన చెప్పారు. తాను అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని ఆయన చెప్పారు. కొచ్చి ఫ్రాంచైజీ విషయంతో తన మంత్రిత్వ శాఖకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పారు. డబ్బులు ఏ విషయంలోనూ ఎప్పుడు కూడా తన మీద పనిచేయవని అందరికీ తెలుసునని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+