• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జమున కూతురికి కట్నం వేధింపులు

By Pratap
|

Jamuna
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి జమున కూతురికి కూడా కట్నం వేధింపులు తప్పలేదు. తనను భర్త, అత్తామామలు మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని జమున కూతురు స్రవంతి హైదరాబాద్ నగర నేర విభాగం (సిసిఎస్) మహిళా స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేను నమోదు చేసి స్రవంతి అత్తామామలను పోలీసులు అరెస్టు చేసి చంచల్ గుడా జైలుకు తరలించారు. భర్త రాహుల్ రెడ్డి పరారీలో ఉన్నాడు. స్రవంతి ప్రేమించి మూడేళ్ల క్రితం రాహుల్ రెడ్డిని పెళ్లి చేసుకుంది.

స్రవంతి ఫిర్యాదు ప్రకారం - ఆడపడుచు కట్నం కింద జమున కుటుంబ సభ్యులు లక్ష రూపాయలు ఇచ్చారు. అయితే వారు పది లక్షల రూపాయలు కావాలని పట్టుబట్టారు. చివరకు 4 లక్షల 75 వేల రూపాయలు ఇచ్చారు. అయితే దాంతో సంతృప్తి చెందకుండా కారు కావాలంటూ డిమాండ్ చేశారు. ఇలా గొంతెమ్మ కోరికలు కోరుతూనే ఉన్నారు. చివరకు జమున ఉంటున్న బంజారాహిల్స్ లోని ఇంటిని రాసివ్వాలంటూ వేధించడం మొదలు పెట్టారు. దాంతో కుమారుడు అవిష్ ను తీసుకుని స్రవంతి పుట్టింటికి వచ్చేసింది. నిరుడు ఆగస్టులో విడాకుల కోసం కోర్టులో పిటిషన్ కూడా వేసింది. అయినా వేధింపులు ఆగకపోవడంతో సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X