బాబును తప్పుదారి పట్టిస్తున్నారు: నన్నపనేని

తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసేవారికి పదవులు దక్కవని, కాంగ్రెసు పార్టీలో కష్టపడి పనిచేసేవారికే పదవులు దక్కుతాయని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీని ఓ వర్గం శాసిస్తోందని ఆమె విమర్శించారు. జయప్రద, రోజాలు పార్టీలోకి వస్తామని అంటున్నందననే మీరు పార్టీపై విమర్శలు చేస్తున్నారా అని అడిగితే వారిని పార్టీలోకి రావాలని తాను అడిగానని, తానే వారిని పార్టీలోకి తెస్తానని ఆమె అన్నారు. అసంతృప్తితో తాను పార్టీపై విమర్శలు చేయడం లేదని, పార్టీ పరిస్థితిపై మాట్లాడుతున్నానని ఆమె అన్నారు. జయప్రదను గానీ రోజాను గానీ పార్టీలోకి రావద్దని ఎందుకు అంటానని ఆమె అడిగారు.












Click it and Unblock the Notifications