పెషావర్: పాకిస్తాన్ జంట పేలుళ్లలో శనివారం 20 మంది మరణించారు. శరణార్థులకు సహాయం అందిస్తుండగా ఈ పేలుళ్లు సంభవించాయి.కోహట్ లోని గారిసన్ నగరంలోని కచ్చా పుఖా శిబిరంలో ఈ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 20 మంది మరణించారు. 30 మంది దాకా గాయపడ్డారు.
మొదటి పేలుడు శరణార్థులకు సహాయంగా పదర్థాలు అందిస్తుండగా సంభవించిందని, ఆ తర్వాత కొన్ని నిమిషాలకే మరో పేలుడు సంభవించిందని కోహట్ పోలీసు చీఫ్ దిలావర్ ఖాన్ చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.