హైదరాబాద్: దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజపై మూవీ ఆర్ట్సిస్టుల సంఘం (మా) అధ్యక్షడు మురళీ మోహన్ తీవ్రంగా మండిపడ్డారు. సినిమా వారసులు నటులు కాదంటూ తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యపై మురళీమోహన్ సోమవారం తీవ్రంగా ప్రతిస్పందించారు. భరద్వాజ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. వారసత్వం గురించి మాట్లాడే హక్కు భరద్వాజకు లేదని ఆయన అన్నారు.
తమ్మారెడ్డి కృష్ణమూర్తి వారసుడిగానే తమ్మారెడ్డి భరద్వాజ సినీ రంగంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మళ్లీ చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.