సిద్ధిపేట: కాంగ్రెసు శాసనసభ్యుడు ముత్యంరెడ్డికి మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. మెదక్ జిల్లా తొగుట మండలం గోవర్ధన గిరి ప్రజాపథంలో పాల్గొనడానికి వచ్చిన ముత్యంరెడ్డిని తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన కారుపై తెలంగాణవాదులు కోడిగుడ్లు విసిరారు. దీంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు.
లాఠీచార్జీలో 30 మందికి పైగా గాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేయాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు. తెలంగాణ నినాదాలు చేశారు.