క్రమంగా విద్యుత్ కోత ఎత్తేస్తాం: సిఎం

పరిశ్రమలకు విద్యుత్ కోతను 36 గంటల నుంచి 24 గంటలకు తగ్గించాలని ఆయన అధికారులను ఆదేశించారు. వ్యవసాయానికి రోజుకు ఏడు గంటలు ఇబ్బంది లేకుండా విద్యుత్ అందించాలని ఆయన చెప్పారు. మూడో వారంలో విద్యుత్ కోత ఎత్తివేతకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, పరిశ్రమలకు, వాణిజ్య సముదాయాలకు విద్యుత్ చార్జీలను పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం బుధవారం ఇఆర్సీకి పంపుతుంది. ఈఆర్సి ఆమోదిస్తే కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయి. ఒకటి, రెండు రోజుల్లో అదికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications