హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జలయజ్ఞంపై సిఎంకు లేఖాస్త్రాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: జలయజ్ఞంపై పలు విషయాలు లేవనెత్తుతూ మాజీ మంత్రి జానారెడ్డి, నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కె. రోశయ్యకు విడివిడిగా లేఖలు రాశారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి గొప్పగా చెప్పుకుంటూ వస్తున్న జలయజ్ఞంపై ఇప్పటి వరకు ప్రతిపక్షాలే విమర్శలు చేస్తూ వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వానికి తన పార్టీ నాయకుల నుంచే విమర్శలు వస్తున్నాయి. ప్రాణహిత-చేవెళ్లలో అంచనాలు పెంపు, కమీషన్లపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వెంకటస్వామి ఇటీవల ఆరోపణలు చేశారు. పోలవరం అంచనాలు పెంచేశారంటూ మరో సీనియర్‌ నాయకుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. కడప జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యుడు డిఎల్‌ రవీంద్రారెడ్డి గత అసెంబ్లీలోనే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేశారు. జానారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రికి రాసిన లేఖల సారాంశంతో ఓ ప్రముఖ దినపత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది.

జలయజ్ఞం కింద పెరిగిన ప్రాజెక్టుల సంఖ్య, నిర్మాణ వ్యయం పెరుగుతూ పోతున్న వైనం, లిఫ్టులకు వినియోగమయ్యే విద్యుత్తు తదితర అంశాలపై జానారెడ్డి ముఖ్యమంత్రికి రాసిన లేఖలోని అంశాలను ఆ పత్రిక ప్రచురించింది. లిఫ్టులకు అవసరమైన విద్యుత్తు, నిర్వహణ, అమలు ఖర్చును ప్రభుత్వం భరిస్తామని చెపుతున్నా రైతులకు ఆందోళనగానే ఉందని ఆయన అన్నారు. ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, సూక్ష్మసేద్యం, లిఫ్టుల వంటి అంశాలపై తాను పలుమార్లు తన అభిప్రాయం వెల్లడించానని, వాటిని తిరిగి సమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జానారెడ్డి లేఖ రాయడానికి ముందుగానే మార్చి 23న నల్గొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ ‌రెడ్డి ముఖ్యమంత్రి రోశయ్యకు ఓ లేఖ రాసినట్లు ఆ పత్రిక తెలిపింది. ఏడు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కోరినా, వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పలు విషయాలను ఆయన లేవనెత్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X