హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనంత స్వర్ణమయ ప్రాజెక్టుపై హైకోర్టు స్టే

By Pratap
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చేపట్టిన అనంతస్వర్ణ మయ ప్రాజెక్టు పనులు నిలిపేయాలని హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టిటిడి పాలక మండలి తీర్మానాల అమలుపై చర్యలు తీసుకోవద్దని కూడా హైకోర్టు ఆదేశించింది. అనంత స్వర్ణమయ ప్రాజెక్టు పనుల వల్ల ఆలయం చారిత్రక ప్రాధాన్యం అంతర్థానమవుతుందని, అనంతస్వర్ణ మయ ప్రాజెక్టు ఆగమ శాస్త్రాలకు విరుద్దమని ఆరోపిస్తూ హైదరాబాద్ కనకదుర్గ సేవా సమితి నాయకుడు రాఘవరెడ్డి హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ఆ ఆదేశాలు ఇచ్చింది.

తిరుమల ప్రధాన ఆలయం ఆనంద నిలయంలోని గోడలకు బంగారు తొడుగులు చేయించాలని టిటిడి చైర్మన్ ఆదికేశవులు నాయుడు నిర్ణయించారు. అందుకు 150 కిలోల బంగారం, 20 కోట్ల రూపాయల నగదు సేకరించారు. బంగారాన్ని కరిగించి రేకులు చేసేందుకు ప్రత్యేక వర్క్ షాప్ ను కూడా ఏర్పాటు చేశారు. దీనివల్ల గోడలపై ఉన్న శాసనాలు, లిపి మరుగున పడతాయని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలు చూసిన తర్వాతనే స్పందిస్తానని ఇవో కృష్ణారావు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X