అధికార వాంఛతో రాలేదు: చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్: తాను అధికార వాంఛతో రాజకీయాల్లోకి రాలేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన బుధవారం ప్రసంగించారు. ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజా తీర్పును శిరసా వహిస్తానని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకు సాగుదామని, ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని ఆయన అన్నారు. ఎన్నికల్లో తాము సంతృప్తికరమైన ఫలితాలు సాధించలేదనేది వాస్తవమని, ప్రజాకర్షణ, కార్యకర్తల బలం ఉండి కూడా తాము అధికారంలోకి రాలేదంటే లోపం ఎక్కడో ఉంటుందని, ఆ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు తనపై అచంచల విశ్వాసంతో తన వెంట ఉన్నవారికి కృతజ్ఢతలు చెబుతున్నానని ఆయన అన్నారు.

వారి అధికారానికి ఆటంకంగా ఉన్నామని భావిస్తున్న వారు తమ పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను మానసికంగా దెబ్బ తీసేందుకు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. మీడియా ద్వారా కూడా తమను దెబ్బ తీసే ప్రయత్నానికి పూనుకున్నారని ఆయన విమర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తనపై ఉంచిన అచంచల విశ్వాసం వల్ల తన బాధ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ ఉండడం కొందరికి అధికారంలోకి రావడానికి ఆటంకంగా ఉందని, దాంతో వారు వారి పార్టీ విధానాలను చెప్పుకోకుండా తమ పార్టీని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీని ఎందుకు నిలబెట్టలేకపోయామని ప్రజలు బాధపడుతున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+