తెలంగాణలో పర్యటించి తీరుతా: చిరంజీవి

వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమవుతుందనే ప్రచారం చేస్తున్నారని, అది గోబెల్స్ ప్రచారమని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీలో తమ పార్టీని విలీనం చేసే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. తమ పార్టీ వల్లనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేకపోయిందని, కాంగ్రెసు పార్టీ బొటాబొటీ మెజారిటీతో గెలిచిందని, ఆ రకంగా తాము శభాష్ అనిపించుకున్నామని ఆయన అన్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ నుంచి వెళ్లిపోయే వారు వెళ్లిపోవచ్చునని, ఉండేవారే నిజమైన నాయకులని ఆయన అన్నారు.
షార్ట్ కట్ లో రాష్టాన్ని దోచుకోవాలని కొందరు కోవర్టులు పార్టీలోకి వచ్చారని, వారే పార్టీని వదిలి వెళ్లిపోతున్నారని, శ్రేయోభిలాషులెవరూ పార్టీని వీడడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications